JANGITISRINIVASMUDIRAJ96

Mar 25 2023, 13:51

భారత దేశంలో నేడు చీకటి రోజు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యాన్నికి ,భావ ప్రకటన స్వేచ్ఛకు గోడ్డలిపేట్టు                                                                        ప్రజాస్వామ్య దేశంలో నేడు చీకటిరోజు                             

                                    మాజీ పిసిసి భూ కమిటీ మెంబర్ జంగింటి శ్రీనివాస్ ముదిరాజ్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని కుట్రపూరితంగా రద్దు చేయడం అప్రజాస్వామికమని, దేశంలో నరేంద్ర మోడీ నియంతృత్వ విధానాన్ని అంతం చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు చీకటి రోజుగా అభివర్ణస్తూ రాహుల్ గాంధీ గారి మీద తీసుకొన్న నిర్ణయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి గణేష్,మాజీ పిసిసి భూ కమిటి మెంబర్ జంగింటి శ్రీనివాస్ ముదిరాజ్* లు తీవ్రంగా ఖండించారు. 

మోడీ నిర్ణయాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో తేది: 25-03-2023 శనివారం రోజు మోడీ దిష్టి బొమ్మను కాంగ్రేస్ నాయకులు దగ్ధం చేశారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు 1978లో శ్రీమతి ఇందిరా గాంధీ గారిని కూడా అప్పటి జనతాపార్టీ డిస్క్వాలిఫై చేస్తే ప్రజాధారణతో 1980 లో ప్రధానిగా పార్లమెంట్ లో అడుగుపెట్టిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ..

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టులాంటిదని

దేశ ఐక్యత - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టడం…

అదానీ- మోడీ చీకటి స్నేహం పై నిలదీయడం ,అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయని, నిన్న రాహుల్ గాంధీ మీద వచ్చిన తీర్పుపై హైకోర్ట్ లో అప్పీల్ చేసుకొనేందుకు నెలరోజులు గడువు ఇచ్చినా కూడా న్యాయవ్యవస్థ ఆదేశాలు గౌరవించకుండా నేడు చట్టవిరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బీజేపీ తీసుకొన్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.

భవిష్యత్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయకూడదనే దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ చేసిన కుట్ర ఈరోజు బహిర్గతమైనదని, దీనిని దేశ ప్రజలు గుర్తించాలని కోరారు. 

ప్రస్తుతం ఈదేశంలో ప్రధాని ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, నరేంద్ర మోడీ మరియు అమిత్ షా ఇద్దరు కలిసి అదానీ,అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలకు ఈ దేశాన్ని అమ్మేస్తున్నారని కేంద్రప్రభుత్వ నియంతృత్వ ధోరణిని, అప్రజాస్వామిక విధానాన్ని అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.

 లోక్ సభలో ఒక ఎంపీని అనర్హత వేటు వేయాలంటే, రాష్ట్రపతి మరియు ఎన్నికల కమిషనర్ తో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది... కానీ ఈ బీజేపీ ప్రభుత్వం. స్వయం ప్రతిపత్తి గల సంస్థలను నిర్విరామం  చేసినది బిజెపి ప్రభుత్వం....

 ప్రజాస్వామ్యకు వాదులు మేధావులు, ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలలను ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు .... రాబోయే రోజులు బిజెపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

JANGITISRINIVASMUDIRAJ96

Mar 23 2023, 14:00

అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్న కేసీఆర్! అరచేతిని అడ్డుపెట్టి సూర్యక్రాతినాపలేరు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్


అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్న కేసీఆర్!

అరచేతిని అడ్డుపెట్టి సూర్యక్రాతినాపలేరు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 23-03-2023 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

అక్రమంగా అరెస్ట్ చేసి కాంగ్రేస్ పార్టీ నాయకులను భయపెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తేతుందని పిసిసి భూ కమిటీ మాజీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజి వ్యవహారంపై సిట్ కమిటీ చేస్తున్న దర్యాప్తునాకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని సిట్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేయగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సిట్ ముందు హాజరు ఐతున్న సందర్భంగా ముంద్ధస్తూగ కాంగ్రేస్ నాయకుల అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రేస్ నాయకులు విలేకరులతో మాట్లాడారు

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిపిసిసి భూ కమిటీ మాజీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి గణేష్, ఐ ఎన్ టీ యు సి జిల్లా అధ్యక్షులు సుంచు రమేష్, బిసి సెల్ మండల అధ్యక్షులు బంక చిరంజీవిలు మాట్లాడుతూ అడగవోతే కడగవోయినట్లు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియ చేస్తున్న కాంగ్రేస్ నాయకులను పోలీసులను అడ్డు పెట్టుకొని నిలువరింప చేస్తున్నాడని కేసీఆర్ ను దుయ్యబట్టారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను అడిగే హక్కు ప్రతి పౌరనికి ఉంటుందని కేసీఆర్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని అన్నారు.